ఆకేరు న్యూస్,రాయపర్తి : పాలకుర్తి (PALAKUTRHY)నియోజకవర్గం రాయపర్తి (RAYAPARTHY)మండలకేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు(ERRABELLY DAYAKAR RAO)నుపోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. మండలంలో నెలనెలకొన్న యూరియా కొరతకు నిరసనగా మండల కేంద్రం రాయపర్తిలో రైతులు ఆందోళన చేపట్టారు. ధర్నా నిర్వహించి ప్రభత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. యూరియాను వెంటనే సరఫరా చేయాలంటూ డిమాండ్ చేశారు. రైతుల ఆందోళను మద్దతుగా ఎర్రబెల్లి దయాకర్ రావు ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నరైతులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.ఆందోళనలో వేలాది మంది రైతులు పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో పరిస్థితి అదుపుచేసేందుకు ప్రయత్నించిన పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. ఈ నేపధ్యంలో పోలీసులు ఎర్రబెల్లి దయాకర్ రావును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎర్రబెల్లి అరెస్ట్‌ను నిరసిస్తూ రైతుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
………………………………….
