ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఐసెట్ (TG ICET) ఫలితాలు విడుదలయినాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఐసెట్ 2024 ప్రవేశ పరీక్ష జూన్ 5, 6 తేదీల్లో 116 కేంద్రాల్లో నిర్వహించారు. హైదరాబాద్ లోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో కాకతీయ యూనివర్సిటీ ఇంచార్జి వీసీ వాకాటి కరుణ, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్ లింబాద్రి శుక్రవారం ఫలితాలను విడుదల చేశారు. 91.92 శాతం మంది విద్యార్థులు ఐసెట్ లో అర్హత సాధించారు. మొత్తం 86,156 మంది దరఖాస్తు చేసుకున్నారు. 77,942 విద్యార్ధులు ఈ పరీక్షకు హాజరయ్యారు. 71,647 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది ఐసెట్ ప్రవేశ పరీక్షను వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ నిర్వహించింది. అధికారిక వెబ్సైట్ https://icet.tsche.ac.in/ లో విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాల్ని నమోదు చేసి ర్యాంక్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
————————-
Related Stories
October 9, 2024
October 9, 2024