ఆకేరున్యూస్, హైదరాబాద్: టీజీ టెట్ -2024 హాల్ టికెట్లు ఎట్టకేలకు విడుదలయ్యాయి. షెడ్యూల్ ప్రకారం గురువారమే హాల్ టికెట్స్ విడుదల కావాల్సి ఉండగా సాంకేతిక కారణాల వల్ల విడుదల కాలేదు. మొత్తానికి శుక్రవారం సాయంత్రం 5 గంటల తర్వాత టీజీ టెట్ హాల్ టికెట్లను విడుదల చేశారు. జనవరి 2 నుంచి 20వ తేదీ దాకా టెట్ పరీక్షలను ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించనుండగా.. జనవరి 11న నిర్వహించే మార్నింగ్ సెషన్, జనవరి 20న నిర్వహించే ఉదయం, మధ్యాహ్నం సెషన్లకు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేయలేదని అధికారులు పేర్కొన్నారు. సాంకేతిక కారణాల వల్ల ఆ మూడు సెషన్ల హాల్ టికెట్లను విడుదల చేయలేకపోతున్నామని, ఈ సెషన్స్‌కు సంబంధించిన హాల్ టికెట్లు సంబంధిత వెబ్సైట్లో డిసెంబర్ 28 నుంచి అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
………………………………………….