Published:
Updated: 28 Dec 2024 • 04:50 AM
ఆకేరు న్యూస్, వరంగల్ : తెలంగాణలో పులుల సంచారం కలకలం రేపుతోంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో పులులు సంచారంతో పాటు.. తాజాగా వరంగల్ జిల్లాలో పులి జాడలు కనిపించాయి. నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామ శివారులో పులి సంచరిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. స్థానికంగా ఉన్న పంట పొలాల్లో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. పులి సంచారం నేపథ్యంలో రైతులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
…………………………………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
