* విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
* పేపర్-1లో 67.13%, పేపర్-2లో 34.18% మందికి అర్హత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : టీజీ టెట్ – 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఫలితాలను విడుదల చేశారు. పేపర్-1 పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా 57,725 మంది అర్హత సాధించారు. పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా 51,443 మంది అర్హత పొందారు. ఈ క్రమంలో పేపర్-1లో అర్హత సాధించిన వారు 67.13% కాగా, పేపర్-2లో 34.18% మంది అర్హత దక్కించుకున్నారు. 2023తో పోలిస్తే పేపర్-1లో 30.24% అర్హత శాతం పెరిగింది. 2023తో పోలిస్తే పేపర్-2లో 18.88% అర్హత శాతం పెరిగింది. రాష్ట్రంలో జూన్ 2వ తేదీతో ఈ పరీక్షలు ముగిశాయి. మే 20వ తేదీన ప్రారంభమైన టెట్ పరీక్షలు 10 రోజుల పాటు జరిగాయి. పేపర్-1కి 86.03 శాతం మంది, పేపర్-2కి 82.58 శాతం మంది హాజరయ్యారు. ఈ ఏడాది మార్చి 15వ తేదీన నోటిఫికేషన్ వెలువడగా.. పేపర్-1కి 99,958 మంది.. పేపర్-2కి 1,86,423 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫలితాలను https://schooledu.telangana.gov.in అధికారిక వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
———————–