* కువైట్లో భారీ అగ్ని ప్రమాదం
* మృతుల సంఖ్య పెరిగే అవకాశం
ఆకేరు న్యూస్ డెస్క్ : భారీ అగ్ని ప్రమాదం ఏకంగా 41 మందిని మింగేసింది. తీవ్ర విషాదాన్ని నింపింది. కువైట్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ అపార్ట్మెంట్లో మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలో వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 41 మంది సజీవ దహనమయ్యారు. వారిలో ఐదుగురు భారతీయులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. దట్టమైన పొగ వ్యాపించడంతో అపార్ట్మెంట్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
—————————