
– 5వ తరగతిలోకి స్పెషల్ కేటగిరి ఫలితాలు కూడా విడుదల
ఆకేరు న్యూస్ , కమలాపూర్ : తెలంగాణ గురుకుల TGCET 5వ తరగతి ప్రవేశ పరీక్ష తుది ఫలితాలు నిన్న రాత్రి విడుదలయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో tgswreis.telangana.gov.in అందుబాటులో ఉంచారు. 5వ తరగతి లో ప్రవేశాలకు గాను తెలంగాణలోని జనరల్ వెల్ఫేర్, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, BC సంక్షేమ రెసిడెన్షియల్ సొసైటీలకు చెందిన గురుకుల పాఠశాలలో ప్రవేశాలు కల్పించారు.స్టూడెంట్ పేరు, స్కూల్ కోడ్, స్కూల్ అడ్రస్,వివరాలతో కూడిన ఫైనల్ రిజల్ట్ ను ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు.ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు హాస్టల్ తో పాటు,నాణ్యమైన భోజనం, నాణ్యమైన విద్యను గురుకులాలు ఉచితంగా అందిస్తున్నాయి. ఈ 5 వ తరగతి ప్రవేశ పరీక్షకు గాను 88,824 మంది విద్యార్థులు అప్లికేషన్లు నమోదు చేసుకున్నారు.
ఫలితాలను చూసుకోవడానికి
✓ అధికారిక వెబ్సైట్ tgswreis.telangana.gov.in ను సందర్శించండి
✓New declaration of TGCET 2025 Results 5th standard జాబితాపై క్లిక్ చేయండి, స్క్రీన్‌పై PDF కనిపిస్తుంది.
✓ pdfని డౌన్లోడ్ చేసుకొని ఫలితాలు చెక్ చేసుకోండి.
…………………………………………..