
* ట్విటర్ లో ఓ విద్యార్థి ట్వీట్ కు కేటీఆర్ స్పందన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : “నేను ఇటీవలే నిజాం కాలేజీ నుండి పట్టభద్రుడయ్యాను. ప్రభుత్వం మా చివరి సంవత్సరం స్కాలర్షిప్ విడుదల చేయనందున, నా TC పొందడానికి, దాదాపు RTF ₹28,000 + MTF ₹14,000 చెల్లించవలసి వచ్చింది. నేను సెల్ఫ్-ఫైనాన్స్ కోర్సు చదివాను మరియు మధ్యతరగతి నేపథ్యం నుండి వచ్చాను. దయచేసి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ను విడుదల చేయండి” అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఓ విద్యార్థి మాజీ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన కేటీఆర్(KTR).. స్కాలర్షిప్ బకాయిలపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిజాం కాలేజీ విద్యార్థిని సుమన ఎక్స్ వేదికగా కేటీఆర్కు అభ్యర్థన చేయగా.. ఆయన స్పందించారు. ఈ అంశాన్ని తన దృష్టికి తీసుకొచ్చినందుకు థ్యాంక్యూ చెప్పారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో మీరు అత్యంత చురుకైన నాయకులలో ఒకరు. నిజాం కళాశాల పూర్వ విద్యార్థిగా, మీరు ఎక్స్ (X)వేదికగా మా సమస్యలను ముందుగానే పరిష్కరించారని ఈ సందర్భంగా విద్యార్థి కేటీఆర్ ను పొగిడారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము అని సుమన అనే విద్యార్థిని ట్వీట్ చేశారు. దీనికి సత్వరం స్పందించిన కేటీఆర్ రిప్లయ్ ఇచ్చారు.
…………………………………………..