![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/02/download-36.jpg)
* ప్రజలు నిలదీస్తారనే భయంతో పారిపోయారు
* ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హామీలపై ప్రజలు నిలదీస్తారనే భయంతోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ రాకుండా భయంతో పారిపోయారని బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సంచలన ఆరోపణలు చేశారు. మున్ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు ఎక్కడా తిరిగే పరిస్థితి ఉండదని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలుచేయలేకపోతే ప్రజలు ఊరుకోబోరని హెచ్చరించారు. హైదరాబాద్లోని తన నివాసంలో జాగృతి మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కవిత మాట్లాడారు. ఎన్నికల ముందు
సోనియా గాంధీ(SoniaGandhi), ప్రియాంక గాంధీ(Priyanka gandhi), రాహుల్ గాంధీ (Rahulgandhi)వచ్చి చిలుక పలుకులు పలికారని, రేవంత్ రెడ్డి ( Revanth Reddy) ముఖం కాదని, సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీల ముఖం చూసి మహిళలు కొంత వరకు ఓట్లు వేశారని తెలిపారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు అయినా మహిళలకు 2500 ఇవ్వడం లేదన్నారు. . రేవంత్ రెడ్డి మహిళలకు రూ .35 వేల చొప్పున బాకీ పడ్డారని ఆరోపించారు.
………………………………………