
* ఒంటిమిట్టలో కల్యాణం రాత్రివేళ వెనుక ప్రత్యేక కారణం
ఆకేరు న్యూస్, అమరావతి : దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా ఈరోజు జరిగాయి. భద్రాచలంలోనూ కనుల పండువగా రామ కల్యాణం జరిగింది. కానీ ఒంటిమిట్ట(Vontimitta)లోని శ్రీరాముల వారి కల్యాణం ఏప్రిల్ ఆరున జరగనుంది. ఈనేపథ్యంలో అక్కడ కళ్యాణానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనునన్నాయి. కళ్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు (Vontimitta Sri Rama Brahmotsavam) రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. కళ్యాణోత్సవంలో పాల్గొనే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించేలా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్యాలరీలలో ఉండే భక్తులతో పాటు, కల్యాణం చూసేందుకు వచ్చిన భక్తులందరూ సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి రోజున కల్యాణం జరుగుతుండగా, ఒంటిమిట్టలో మాత్రం చతుర్దశి, పున్నమి రోజు చంద్రుడు వీక్షించేలా రాత్రి సమయంలో కల్యాణం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. స్తారు. ఈసారి ఏప్రిల్ 11న రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య కల్యాణం జరగనుంది.
చంద్రుడికి ఇచ్చిన మాట ప్రకారం..
పగటిసమయంలో తాను కళ్యాణం చూడలేకపోతున్ననని బాధపడిన చంద్రుడి(Moon)కి శ్రీరామచంద్రుడు మాటిచ్చాడట. అందుకే ఒంటిమిట్ట ఆలయంలో నిండు పౌర్ణమి రోజు కళ్యాణం జరుగుతుంది. మరో కథనం ప్రకారం…చంద్రవంశానికి చెందిన విజయనగరరాజులు తమ కులదైవానికి తృప్తికలిగేలా … రాత్రివేళ కళ్యాణం జరిపించే ఆచారం ప్రారంభించారని ఇప్పటికీ అదే కొనసాగుతోంది అంటారు. కథనాలు, కారణాలు ఏమైనా కానీ ఇతర ఆలయాలకు భిన్నంగా ఒంటిమిట్టలో కళ్యాణం పున్నమి కాంతుల్లో జరగడం ప్రత్యేకం.
…………………………………………..