* బాలరాముడి నుదుటిపై సూర్య తిలకం
ఆకేరు న్యూస్, డెస్క్ : దేశ వ్యాప్తంగా శ్రీరామ నామం జపిస్తున్న వేళ.. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య (Ayodhya) రామ మందిరంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆలయంలోని బాలరాముడి (Bala Ramudu) నుదుటిపై సూర్యతిలకం (Surya Tilakam) పడింది. బాలరాముడి నుదుటిపై సూర్యతిలకం కనిపించగానే భక్తజనం పరవశించిపోయారు. సుమారు 4 నిమిషాల పాటు సూర్య కిరణాలు కొనసాగాయి. బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత వచ్చిన రెండో శ్రీరామనవమి ఇది. స్వామి దర్శనం కోసం దేశ, విదేశీ భక్తులు అయోధ్యకు పోటెత్తారు. ఈ సందర్భంగానే రామ్‌లల్లా నుదుటిపై సూర్యుడు తన కిరణాలతో తిలకాన్ని దిద్దే అద్భుత ఘట్టం యావత్ భక్త జనులను పులకింపజేసింది. ఆలయ మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు, కటకాలతో కూడిన సాంకేతిక యంత్రాంగం సాయంతో ఏర్పాటు చేసిన దర్పనం నుంచి ఈ కిరణాలు ప్రసరించాయి. పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు శాస్త్రవేత్తలు. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపులోపలికి కాంతి ప్రసరించి తిలకంగా కన్పించింది. బాలరాముడి నుదిటిపై కన్పించిన సూర్య తిలకం(Surya Tilakam)తో భక్తజనం పరవశించిపోయింది.
……………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
