* పరిసరాల పరిశుభ్రత బాధ్యతగా గుర్తించాలి
* ములుగుజిల్లా కలెక్టర్ దివాకర టీఎస్
ఆకేరు న్యూస్, ములుగు: రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్య అందించడమే కాకుండా ప్రతి విద్యార్థికి నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించాలనే ఉద్దేశంతో 40 శాతం డైట్ చార్జీలను పెంచిందని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన డైట్ చార్జీలతో అందిస్తున్న పౌష్టిక ఆహార కార్యక్రమాన్ని శనివారం డైరెక్టర్ టిసిఆర్ అండ్ టిఐ సముజ్వల, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్లతో కలిసి ఆయన ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి కడుపునిండా తిండి కంటి నిండా నిద్రపోవాలని ఉద్దేశంతో ప్రభుత్వం సాహోపిత నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ప్రతి సంవత్సరం విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో టెండర్లను నిర్వహించడం జరుగుతుందని, టెండర్ లో పాల్గొనే వ్యక్తులు ప్రభుత్వం ఇచ్చే నిధులతో పిల్లలకు సరిjైున అందించలేమని విషయాన్ని తమ దృష్టికి తీసుకురాగా ప్రభుత్వానికి ఈ విషయం తెలియపరడంతో డైట్ చార్జీలను పెంచడం ఆశించదగిన విషయమని అన్నారు. గత కొద్ది రోజుల క్రితం విద్యా కమిషన్ సభ్యులు జిల్లాలోని ఆరు ఆశ్రమ పాఠశాలలో పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని వివరించారు. ఏడు రోజుల పాటు ఏ రోజుకి ఏ ఆహారం అందిస్తున్నానే విషయం తెలుసుకోవడానికి ప్రతి పాఠశాలలో బోర్డులను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ విషయం పిల్లల తల్లిదండ్రులకు తెలియడం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని అన్నారు.
విద్యార్థిని విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూనే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంధాలయ చైర్మన్ రవిచందర్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా గతంలోని పాలకులు డైట్ చార్జీలను పెంచకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందలేకపోయిందని, నేడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 40 శాతం డైట్ చార్జింగ్ పెంచారని అన్నారు. డైట్ చార్జ్ పెంచడమే కాకుండా 200 శాతం కాస్మోటిక్స్ చార్జీలను పెంచారని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థి కడుపునిండా తిండి తిని ఉన్నత చదువులు చదవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చే జారీ చేయబడిన హాండ్ బుక్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. కాగా కలెక్టర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ విద్యార్థులతొ కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో డిఈఓ పాణిని, డిడ బ్లు ఓ శిరీష, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………