Mamnoor Airport Tender Notification
అకేరు న్యూస్ వరంగల్ : మామునూర్ ఎయిర్ పోర్టును టెండర్ దక్కించుకున్న అనంతరం 15 నెల్లలో పూర్తిచేయాలనే నిబంధనను AAI పెట్టింది. టెండర్ దాఖలుకు AUG 12న సా. 6 గంటల వరకు చివరి తేది అని, ధరావత్తు కింద రూ.6.10కోట్లను చెల్లించాలని, అంచనా వ్యయం రూ.203.49 కోట్లని ప్రకటించింది.
ఈనెల 29 నుంచి 11,800 చెల్లించి టెండర్ ఫామ్‌ను కొనుగోలు చేసి దాఖలు చేయవచ్చని, ప్రీ బిడ్ ఈనెల23న ఎయిర్ పోర్టు ప్రాంగణంలో నిర్వహించనున్నట్టు టెండర్లో తెలిపారు.
పోలీసు క్యాంప్ వైపే ఎంట్రీ, ఎగ్జిట్
మామునూర్ ఎయిర్ పోర్టు నిర్మాణం నమూనాను ఏఏఐ విడుదల చేసింది. ఎయిర్ పోర్టుకు ఎంట్రీ ఎటువైపు ఉంటుందోననే ఉత్కంఠ ఓరుగల్లు వాసుల్లో ఉండేది. వరంగల్ – ఖమ్మం ప్రధాన రహదారిపైన ఉన్న పోలీసు క్యాంపు సమీపంలోని తిమ్మాపూర్ క్రాస్ దగ్గర ఎయిర్ పోర్టు ఎంట్రీ, ఎగ్జిట్ల నిర్మాణం ఉండనున్నట్టు మ్యాపులో పేర్కొన్నారు. నక్కలపల్లి వైపు రన్ వే ముగింపు ఉండనుంది.
