ఆకేరు న్యూస్ మెదక్ : కామపిశాచి ఆవహించిన ఓ ప్రబుద్దుడు అమానవీయమైన పనికి పాల్పడ్డాడు.. కొన్ని సందర్భాల్లో మనిషి ఎంతటి నీచమైన స్థాయికి దిగజారుతాడో ఈ సంఘటన రుజువు చేస్తోంది. మనిషి జన్మ ఎత్తిన వారు చెప్పుకోవడానికే సిగ్గుగా ఉన్న ఈ ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయి చిన్న చిన్న పిల్లలపై అత్యాచారం చేసిన కామపిశాచులు ఉన్నారు.. కానీ ఓ ప్రబుద్దుడు కామ దాహం తీర్చుకోవడానికి మూగజీవిని వాడుకున్నాడు.. చెప్పుకోవడానికే సిగ్గుగా ఉన్న ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి జరిగింది. మీర్జాపల్లికి చెందిన సిద్దిరాములు యధావిధిగా సోమవారం రాత్రి తన పశువులను పొలంలో ఉన్న షెడ్డులో కట్టేసి ఇంటికి వెళ్లగా అతని వద్ద పనిచేస్తున్న బిహార్ కు చెందిన రోహిత్ అనే ప్రబుద్దుడు రాత్రి పది గంటల సమయంలో షెడ్డులోకి వెళ్లి బర్రెదూడపై అత్యాచారం చేశాడు.ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో చూసిన షెడ్డు యజమాని.. రోహిత్ పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అతని ఫిర్యాదుతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు…
కొంత మంది వ్యక్తులు ఇలా విపరీతంగా ప్రవర్తించడానికి రకరకాల కారణాలు ఉంటాయి. చిన్నప్పుడు గాయపడిన కొన్ని సంఘటనలు మెదడులో అలాగే నిక్షిప్తమై ఇలా ప్రవర్తిస్తారని మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు. వైద్య పరిభాషలో దీన్ని పారాఫిలియా అని పిలుస్తారు. మళ్లీ ఇందులో చాలా రకాల లక్షణాలు ఉంటాయి,
పారాఫిలియా అంటే ఏమిటి..
ఇదో రకమైన మానసిక రుగ్మత. ఈ జబ్బు ఉన్నవారిలో విపరీతమైన సెక్స్ కోరికలు ఉండి సహజత్వానికి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు. తమ సెక్స్ కోరికలను తీర్చుకోవడానికి పశువులను జంతువులను వాడుకుంటారని మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు. తీవ్రమైన ఒత్తిడికి లోనై విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అసాధారణ మైన లైంగిక కోరికలు కలిగి వాటిని తీర్చుకోవడానికి ఎంతకైనా వెనుకాడరు. ఇలాంటి వారితో సమస్యలు తలెత్తడమే కాకుండా మనుషుల మధ్య సంబందాలు దెబ్బతిని ఇతరులకు హానీ కలిగించే విధంగా కూడా ప్రవర్తిస్తారు.
వాయురిస్టిక్ రుగ్మత..
ఇదో రకమైన సైక్రియాట్రిక్ జబ్బు.. ఈ జబ్బు ఉన్న వాళ్లు ఇతరులను రహస్యంగా గమనిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇతరులు సెక్స్ లో పాల్గొన్నప్పుడు వారికి తెలియకుండా చూస్తూ ఆనందం పొందుతారు. ఇతరుల ఇళ్లలోకి తొంగి చూడడం,కిటికీల్లోంచి గమనించడం,చెట్టు చాటునుంచి చూడడం,శృంగార సంబందమైన వీడియోలను రహస్యంగా చూసి ఆనందం పొందుతారు.
ఎగ్జిబిషనిస్టిక్ డిజార్డర్…
ఇటీవల హైదరాబాద్ మెట్రో రైలులో ఓ వ్యక్తి తన ప్యాంట్ జిప్ను కిందకి లాగి పురుషాంగాన్ని ప్రదర్శించాడట.. ఇది చూసి రైలులో ప్రయాణిస్తున్న వారు భయంతో కేకలు వేశారని విన్నాం..వైద్య పరిభాషలో దీన్ని ఎగ్జిబిషనిస్టిక్ డిజార్డర్ అంటారు. ఈ జబ్బు ఉన్న వాళ్లు అపరిచితుల అనుమతి లేకుండా వారి జననాంగాలను ప్రదర్శిస్తూ ఉంటారు.
ఫ్రోటూరిస్టిక్ డిజార్డర్…
ఈ జబ్బు ఉన్న వాళ్లు బహిరంగ ప్రదేశాల్లో గుంపులు గుంపులుగా ఉన్న చోట ఉదాహరణకు బహిరంగ సభల్లో సినిమా హాళ్లలో జనం ఎక్కువగా ఉన్నప్పుడు దేవలయాల్లో జనం ఎక్కువగా ఉన్నప్పుడు బస్సుల్లో రైళ్లలో ఇతరుల శరీర భాగాలను తాకాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ట్రాన్స్వెస్టిక్ డిజార్డర్..
ఈ జబ్బు ఉన్న వాళ్లు ఇతరుల బట్టలు వేసుకొని తృప్తి పొందుతారు. రహస్యంగా వాళ్ల బట్టలను తీసుకొని ఎవరూ లేని సమయంలో అవి ధరించి మానసికంగా తృప్తి పొందుతూ ఉంటారు. ఇంకా కొంత మంది అయితే డెడ్ బాడీలను భద్ర పరుచుకొని వాటితో లైంగిక ఆనందం పొందుతూ ఉంటారని వైద్యనిపుణులు చెప్తున్నారు. ఇవన్నీ కూడా పారాఫిలియా జబ్బులో బాగాలే అని వైద్యనిపుణులు తెలిపారు. సరిఅయిన చికిత్స చేస్తే ఇలాంటి రుగ్మతలనుండి వారిని బయటకు తీసుకురావచ్చు అని తెలిపారు.
………………………………………………….
