* నవ దంపతులు సహా నలుగురు మృతి
ఆకేరున్యూస్, కేరళ: కేరళలో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లయిన 15 రోజులకే రోడ్డు ప్రమాదంలో నవ వధూవరులు దుర్మరణం చెందారు. శబరిమలకు వెళ్తున్న అయ్యప్ప భక్తుల బస్సును కారు ఢీకొట్టడంతో నవ దంపతులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కేరళలోని పథానంతిట్టకు చెందిన అను, నిఖిల్‌కు 15 రోజుల కిందట వివాహమై హనీమూన్‌కు మలేసియాకు వెళ్లారు. తిరిగి కేరళకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారతో పాటు నిఖిల్ తండ్రి మథాయ్ ఈపన్, అను తండ్రి జార్జ్ బిజులు కూడా ఉన్నారు. తెలంగాణకు చెందిన అయ్యప్ప భక్తులు వెళ్తున్న బస్సును కారు ఢీకొట్టగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నిఖిల్, జార్జ్ బిజు, ఈపన్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అను మృతి చెందింది.
………………………………….