* ధ్వంసమైన సీఎం కారు.. కాన్వాయ్‌లోని రెండు వాహనాలు
ఆకేరున్యూస్, జైపూర్: రాంగ్ రూట్లో వచ్చిన కారు సీఎం కాన్వాయ్‌ను ఢీకొట్టింది. దీంతో సీఎం కారుతో పాటు సీఎం కాన్వాయ్‌లోని రెండు వాహనాలు దెబ్బతినగా.. ముగ్గురు పోలీసులతో సహా ఐదుగురు గాయపడ్డారు. సీఎం వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో బుధవారం జరిగింది. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌తో కలిసి నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించేందుకు సీఎం భజన్‌లాల్ శర్మ తన కాన్వాయ్‌లో బయలుదేరగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే సీఎం భజన్‌లాల్ శర్మ కారు నుంచి కిందకు దిగి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
………………………………………