* సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలకు సంబంధించిన ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ బిల్లు ప్రతిపాదనపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ఇంత హడావిడి చేస్తున్న ప్రధాని మోదీ కేంద్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. శనివారం పార్లమెంట్లో రాజ్యాంగంపై చర్చ జరగగా.. ప్రధాని మోదీ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ ప్రతిపాదనపై ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని ఆయన రద్దు చేయాలన్నారు. రాజ్యాంగంపై చర్చ జరుగుతున్నప్పుడు ఇదే మంచి సమయం… మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్నారు.
……………………………………..