* యువ టూరిజం క్లబ్‌ల నమోదులో వరంగల్ జిల్లాకు ద్వితీయ స్థానం పట్ల దక్కిన గౌరవం
ఆకేరు న్యూస్, వరంగల్: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతులమీదుగా వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద మొమెంటో అందుకున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2024 సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలి లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటి మేనేజ్మెంట్ (ఎన్ఐటిహెచ్)లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో కలెక్టర్ ఈ బహుమతి స్వీకరించారు. ఈ సందర్భంగా అవార్డు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారదా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ జిల్లాలో యువ టూరిజం క్లబ్‌ల నమోదుపై ప్రత్యేక శ్రద్ధ వహించడం వల్ల ద్వితీయ స్థానం సాధించడం సంతోషంగా ఉందని జిల్లా వ్యాప్తంగా నిరాదరణకు గురైన 14 ఆలయాలను గుర్తించి వాటి పునరుద్దరణకు ప్రణాళికలు సిద్దం చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పర్యాటకం, సంస్కృతీ సంప్రదాయాలు, వార సత్వ సందపపై విద్యార్థులకు అవగా హన కల్పించడమే కాకుండా భవిష్యత్తులో పర్యాటకం వల్ల కలిగే లాభాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు,పర్యాటక అనుబంధ రంగాల అభివృద్ధి తదితర అంశాలపై చిన్నప్పటి నుంచే పెంచుకునే అవకాశం యువ క్లబ్బుల ద్వారా విద్యార్థులకు కల్పించి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, రాష్ట్ర టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ వాణి ప్రసాద్, డైరెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.
……………………………