* ఓట్ల కోసమే రైతులు కావాలి వాళ్లు పండిరచిన పంటలు కొనరా
* మిషన్లలో సన్న బియ్యాన్ని నిర్ధారించడం రైతులను మోసం చేయటమే
* కెసిఆర్ ప్రభుత్వం ఎన్నడైనా రైతులను ఇబ్బంది పెట్టిందా.. రైతులు ఆలోచించండి
* ఏ కొనుగోలు సెంటర్లో ఒక్క ధాన్యపు గింజ కూడా కొనలే…. దీనిపై చర్చకు రావాలని ప్రభుత్వానికి సవాల్
* హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
ఆకేరు న్యూస్, కమలాపూర్: అధికారంలో రావడం కోసం రైతులను అన్ని విధాల ఆదుకుంటామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు రైతు పండిరచిన ధాన్యాన్ని కొనకుండా నట్టేట ముంచిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. కమలాపూర్ మండల కేంద్రంలోనీ మార్కెట్ యార్డ్ లో నిర్వహిస్తున్న ఐకేపీ నీ సోమవారం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సందర్శించారు. అనంతరం ఏర్పాటుచేసిన పత్రికా విలేకరులతో ఆయన మాట్లాడుతూ… అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు అమ్మకానికి తీసుకొచ్చిన ధాన్యాన్ని 15 రోజులుగా కొనకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఐకెపిలో వడ్ల అమ్మకాలు మొదలవక చాలామంది రైతులు తనకు ఫోన్ చేశారని ఈ విషయమై తాను వచ్చానని తెలిపారు. ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకపోవడంతో, రైతులు ఆంధ్రా నుంచి వచ్చిన మిల్లర్లకు వడ్లు అమ్ముతూ క్వింటాకు 300 దాక నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందు 500 రూపాయల బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ నేడు 30 రకాల సన్నవడ్లలో కేవలం 18 రకాలు మాత్రమే కొంటానని చెప్పడం, సన్న వడ్లని కొనడానికి ఒక నిర్ధారణ పరికరాన్ని తీసుకొచ్చి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. రైతుబంధు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్న వడ్లకి 500 బోనస్ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా కష్ట సమయంలో కూడా ఎమ్మెల్యేలకు జీతాలు ఇవ్వకున్నా, రైతులకు రైతుబంధు , రైతు భరోసా మాజీ సీ ఎం కేసిఆర్ అందించారని గుర్తు చేశారు.
రాష్ట్రంలోని ఏ కొనుగోలు కేంద్రానికి అయినా వెళ్దామని ఎక్కడైనా ఒక ధాన్యం గింజ కొన్నారో యావత్ తెలంగాణ రైతాంగానికి జవాబు చెప్పాలని ఎమ్మెల్యే అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి ఒక్క రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేదని, కనీసం మిల్లర్లకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి అలాట్మెంట్ కూడా చేయలేదని విమర్శించారు. హామీలు ఇచ్చి నెరవేర్చకుండా రైతులను మోసం చేయొద్దని ఇప్పటికే రైతులు ప్రభుత్వాన్ని నమ్మట్లేదని, రోడ్లెక్కి నిరసనలు చేస్తున్నారని , సమస్య తీవ్రతను అర్థం చేసుకొని మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా హామీలను వెంటనే అమలు పరచాలని పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజి జడ్పీటీసీ సభ్యులు కళ్యాణి లక్ష్మణ్, నవీన్, సింగిల్ విండో వైస్ చెర్మెన్ ఇంద్రసేనారెడ్డి, కేడీసీసీ డైరెక్టర్ కృష్ణప్రసాద్, కమలాపూర్ మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డి కమలాపూర్ మాజీ ఎంపీటీసీలు అశోక్ మెండు రమేష్ మాట్లా వెంకటేశ్వర్లు కమలాపూర్ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మరియు ఇతర గ్రామాల మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
……………………………………………………………