
* చిల్లర రాజకీయాలు చేస్తున్నారు
* పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
ఆకేరు న్యూస్ : హనుమకొండ : కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి (CHALLA DHARMAREDDY)అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతకావడం లేదని, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని ఆత్మకూర్,దామెర మరియు గీసుగొండ మండలాల సమన్వయ కమిటీ సభ్యులతో మాజీ ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామాలలో జరిగిన గ్రామ పార్టీ సమావేశాలపై గ్రామాల వారీగా వారు సమీక్షించారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ…కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, తప్పుడు కేసులు పెట్టే ఎవ్వరినీ వదలబోమని అన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఓటేశామా అని ప్రజలు బాధపడుతున్నారని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 90శాతం బీఆర్ఎస్కే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కలిసికట్టుగా వచ్చే స్థానికసంస్థ ఎన్నికల్లో ముందుకుసాగి విజయకేతనం ఎగురవేయాలని కార్యకర్తలకు లుపునిచ్చారు.గ్రామాల్లో అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని అన్నారు.ఈ సమావేశంలో ఆత్మకూర్,దామెర,గీసుగొండ మండలాల సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
………………………………..