* సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు విమర్శలు
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు, ఆత్మహత్యలతో మరణ మృదంగం మోగుతుందని మాజీ మంత్రి హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేశారు. గురుకులాల్లో విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నా.. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడం సిగ్గుచేటనన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, గడిచిన 11 నెలల కాంగ్రెస్ పాలనలో 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన దుస్థితి ఏర్పడిరదని మండిపడ్డారు. గురుకులాల భోజనంలో నాణ్యత లేకుంటే జైలుకే అని బాలల దినోత్సవం నాడు సీఎం ప్రగల్బాలు పలకడం తప్ప.. ఎలాంటి కార్యచరణకు దిక్కులేదన్నారు. ఎంతో భవిష్యత్తు కలిగిన విద్యార్థులు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతుంటే, వారిని కాపాడాల్సిన ప్రభుత్వం చోద్యం చూడటం శోచనీయమని పేర్కొన్నారు. ఈ ఆత్మహత్యలకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
……………………………………….