* కుక్కకు సపర్యలు చేసేందుకు 27 మంది సిబ్బంది
* ప్రపంచంలోనే ప్రత్యేక కుక్కగా గుంథర్-6
ఆకేరు న్యూస్ డెస్క్ : అది లేచిన వెంటనే సపర్యలు చేసేందుకు పరివారం సిద్ధంగా ఉంటుంది. మార్నింగ్ వాక్ కు తీసుకెళ్లేందుకు ఇద్దరు సిబ్బంది.. తిరిగి వచ్చాక నచ్చింది వండేందుకు చెఫ్.. వండింది పెట్టేందుకు మరొకరు.. స్నానం చేయించేందుకు ఇంకొంకరు.. ఇలా మొత్తం 27 మంది సిబ్బంది. ఎక్కడికైనా తిరగాలంటే ప్రత్యేక విమానం.. సముద్రంలో విహారం చేసేందుకు క్రూయిజ్.. ఈ సంపన్న సౌకర్యాలన్నీ ఎవరికో తెలుసా.. ఓకుక్కకు. అది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన శునకం. వందల కోట్లకు.. సారీ.. వేల కోట్లకు అధిపతి. అందుకే అది అంత ఫేమస్ అయింది. నెట్ ఫ్లిక్స్ లో దాని చరిత్రతో సినిమానే ఉంది. అంత ఆస్తి శునకానికి ఎలా వచ్చింది అనుకుంటున్నారా? అయితే.. జర్మన్ జాతి (The German Shepherd)కి చెందిన ఆ శునకం వివరాలు తెలుసుకోవాల్సిందే.
ఇటలీకి చెందిన గుంథర్..
ఆ శునకం పేరు గుంథర్ – 6(Gunther VI). ఇటలీ (Italy) చెందిన ఈ శునకం ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్క(Worlds Richest Dog)గా రికార్డు సృష్టించింది. దాని ఆస్తి 400 మిలియన్ డాలర్లు(400 MILLION NET WORTH). అంటే రూపాయల్లో 3, 356 కోట్లు. జర్మనీ (Germany) కి చెందిన కౌంటెస్ కార్లోట్టా లీబెన్స్టెయిన్ (Countess Carlotta Leibenstein) అనే బిలియన్ కుమారుడు గుంథర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత కౌంటెస్ జర్మన్ షెపర్డ్ (German Shepherd) జాతికి చెందిన ఓ కుక్కను పెంచుకున్నాడు. దానికి కుమారుడి పేరు పెట్టి గుంథర్ (Gunther) పేరు మీద తన ఆస్తి మొత్తాన్ని రాసిచ్చాడు. తదనంతరం గుంథర్ (కుక్క) వారసులకు ఆ ఆస్తిని బదలాయిస్తూ వచ్చాడు. ప్రస్తుతం గుంథర్ 3 (Gunther III)వారసుడైన గుంథర్ – 6 నికర ఆస్తి విలువ దాదాపు 400 మిలియన్ డాలర్లకు చేరింది. గుంథర్ సంరక్షణ బాధ్యతలను ఓ స్వచ్ఛంద సంస్థ చూసుకుంటోంది. ఆయా ఆస్తులను పెట్టుబడులు పెట్టడం ద్వారా వచ్చే లాభాలను సైతం గుంథర్ పేరు మీద బదలాయిస్తూ వస్తోంది. ఒకప్పుడు పాప్ సింగర్ మడోన్నా (Pop singer Madonna) నివాసమున్న భవనాన్ని సొంతం చేసుకుని గుంథర్ వార్తల్లోకెక్కింది. ప్రస్తుతం గుంథర్ -6 తన ముత్తాత ఆస్తిని అనుభవిస్తోంది.
గుంథర్ ను అలరించేందుకు పాప్ సంగీత బృందం
గుంథర్ 6కు 27 మంది సపరివారమే కాదు.. పాప్ సంగీత బృందం(Pop Music Band) కూడా ఉంది. కొన్ని క్రీడా జట్లను కూడా కొనుగోలు చేశాడు. ఇటలీలో విలాసవంతమైన జీవితం గడుపుతున్న జర్మన్ షెపర్డ్ గుంథర్-6 ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూనే ఉంటాడు. గుంథర్ 6పై నెట్ఫ్లిక్స్ లో గుంథర్స్ మిలియన్స్’ అనే పేరుతో ఉన్న కథనం ప్రకారం.. 27 మంది ఉద్యోగులు ఆ శునకం కోసం పనిచేస్తున్నారు. ఆహారం, వస్త్రధారణ, అలంకరణ చూసుకునేందుకు వ్యక్తిగత కేర్టేకర్లు ఉన్నారు.
———————