* కూల్చవద్దంటూ హైకోర్టుకు..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : చెరువుల, నాలాల పరిరక్షణ, ఆక్రమణలపై ఉక్కుపాదం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన హైడ్రా (Hydra)దూకుడుగా వ్యవహరిస్తోంది. చెరువుల ఎఫ్ టీఎల్ పరిధిలో ఉంటే పెద్ద భవనాలను సైతం కూల్చేస్తోంది. ప్రగతినగర్ ఎర్రకుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కొత్తగా నిర్మించిన మూడు భారీ భవంతులను ఇటీవల నేలమట్టం చేసింది. నిన్న మణికొండ(Manikonda)లో ఓ విల్లాను సైతం పాక్షికంగా ధ్వంసం చేసింది. ఈనేపథ్యంలో కేటీఆర్ ఫామ్‌హౌస్(Ktr Farmhouse)పై అందరి దృష్టీ పడింది. ఫామ్ హౌస్ కూల్చవద్దంటూ ముందు జాగ్రత్తగా హైకోర్టుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌజ్ రగడ హైకోర్టుకు చేరుకుంది. జన్వాడ ఫామ్ హౌజ్ (Janwada Farmhouse)కూల్చొద్దంటూ హైకోర్టు(High court)లో పిటిషన్ దాఖలు అయింది. రియల్టర్ ప్రదీప్ రెడ్డి (Realter Pradeepreddy)హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే FTL పరిధిలో ఉన్న కట్టడాలపై హైడ్రా కొరడా ఝులిపించింది. జన్వాడ ఫామ్ హౌజ్ FTL పరిధిలో ఉండటం.. కూల్చివేసే అవకాశం ఉండటంతో ముందస్తుగా ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
———————————-—