* కలకలం సృష్టించిన బాంబు బెదిరింపు మెయిల్
* 11 రోజుల్లో 250కు పైగా విమాన సర్వీసులకు బెదిరింపులు
ఆకేరు న్యూస్ డెస్క్ : దేశంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నాయి. ప్రయాణికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఫేక్ కాల్స్(Fake Calls) చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, జీవిత ఖైదు విధించడం, శాశ్వత విమాన ప్రయాణ నిషేదం.. భారీ జరిమానా వంటి చర్యలు చేపడతామని కేంద్రం ప్రకటించినా బెదిరింపులు ఆగడం లేదు. తాజాగా విస్తారా(Vistara) విమానానికి మరో బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్(Delhi to Hyderabad)కు వెళుతున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో జైపూర్(Jaipur)లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
గురువారం మొత్తం 95 విమానాల సర్వీసుల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులొచ్చాయి. ఇవన్నీ నకిలీవేనని తేలింది. గడిచిన 11 రోజుల్లో 250కు పైగా విమాన సర్వీసులకు బెదిరింపులు అందినట్లయింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఆగంతకులు చేసిన హెచ్చరికలతో అధికార యంత్రాంగం, రక్షణ బలగాలు, విమానాశ్రయాల సిబ్బందితోపాటు ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. విమానయాన సంస్థలకు ఆర్థికంగా నష్టం వాటిల్లింది. ఇండిగోకు చెందిన హైదరాబాద్-గోవా, కోల్కతా-హైదరాబాద్, కోల్కతా-బెంగళూరు, బెంగళూరు-కోల్కతా, ఢిల్లీ-ఇస్తాంబుల్, ముంబై-ఇస్తాంబుల్, బెంగళూరు-ఝర్సుగూడ, హైదరాబాద్-బగ్దోరా, కోచి-హైదరాబాద్ తదితర సర్వీసులున్నాయి.
………………………………………