* అంతర్జాతీయ డ్రగ్ ప్లెడర్ తో పాటు పలువరి అరెస్ట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌లో హెచ్ న్యూ పోలీసులు మరోసారి భారీగా డ్రగ్స్(DRUGS) స్వాధీనం చేసుకున్నారు. రూ. 26 లక్షల విలువైన ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ తో పాటు పలువురి అరెస్ట్ చేశారు. స్థానిక పోలీసులతో పాటు, హెచ్ న్యూ పోలీసులు(H NEW POLICE) జాయింట్ ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ విక్రేతలపై దాడులు చేశారు.
అంతర్రాష్ట్ర డ్రగ్ ఫెడ్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుమయూన్‌నగర్, హెచ్ న్యూ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. విదేశీ డ్రగ్ పెడ్లర్ నుంచి 50 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కంచన్‌బాగ్(KANCHANBHAGH) పోలీసులకు మరో అంతర్రాష్ట్ర డ్రగ్ ఫెడ్లర్ చిక్కాడు. అతని వద్ద నుంచి 80 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దాదాపు 25 లక్షల విలువ చేసే డ్రగ్స్‌ను హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాసేపట్లో మీడియా సమావేశంలో పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించారు.
…………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
