
* నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్య ఆరుకు చేరిక
* కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ఆకేరున్యూస్, ఢిల్లీ: 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని మోదీ ప్రభుత్వం పూర్తిగా నిర్మూలిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం నక్సల్స్ ప్రభావిత జిల్లాలు 12 నుంచి ఆరుకు తగ్గినట్లు వెల్లడిరచారు. నక్సల్ రహిత భారత్‌ను నిర్మించే దిశగా మనం మరో మైలు రాయిని చేరుకున్నామన్నారు. దేశంలో నక్సలిజాన్ని అంతం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కఠినమైన విధానాన్ని అవలంభిస్తున్నట్లు తెలిపారు. దేశంలో మావోయిస్టుల హింస, భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పాలని ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారని.. ఇందులో భాగంగా సురక్షిత భారత్‌ను నిర్మించడానికి తాము కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా,, నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలను సవిూక్షించేందుకు అమిత్ షా ఈనెల 4, 5 తేదీల్లో ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం షా ఏప్రిల్ 7, 8 తేదీల్లో జమ్ముకశ్మీర్‌లో కూడా పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
……………………………………………