
* ములుగు జిల్లాలో 20 లక్షల వడ్డీ లేని రుణాలు
* మహిళల అభివృద్ధికి పెద్ద పీట
* పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు: రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తూ కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనుసరి అనసూయ సీతక్క అన్నారు. మంగళవారం ములుగు జిల్లాలోని తాడ్వాయి మండల కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మహిళల సంక్షేమ ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పలు రకాల అభివృద్ధి రంగాలలో స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ జిల్లాలో 20 లక్షల వడ్డీ లేని రుణాలు అందించామని వివరించారు. రాష్ట్రంలో 26 వేల కోట్ల రుణాలు మహిళల తోడ్పాటుకు అందించామని వివరించారు. దీంతోపాటు మహిళల పేరుపైనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు ఇందులో భాగంగానే రేషన్ కార్డులు సైతం అందిస్తున్నామని తెలిపారు రేషన్ కార్డు ప్రతి కుటుంబానికి అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నే రేషన్ కార్డులు విస్తృతంగా అందించామని, ఎవరు ఆధ్వర్యంలో పడద్దని ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన వారందరికీ దపాల వారిగా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఆర్థిక పథకాలను వినియోగించుకొని అభివృద్ధి చెందాలని కోరారు అనంతరం రేషన్ కార్డులు లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తో పాటు ములుగు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, అడిషనల్ కలెక్టర్ మహేందర్ జి ,ములుగు డి.ఎస్.పి రవీందర్, ఐటీడీఏ ఏపీవో వసంతరావు తాసిల్దార్ సురేష్ బాబు తో పాటు సివిల్ సప్లై అధికారులు స్థానిక కాంగ్రెస్ మండల కమిటీ అధ్యక్షుడు బొల్లు దేవేందర్ ముదిరాజ్, మేడారం చైర్మన్ అరెం లచ్చు పటేల్, పిఎసిఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్ నాయకులు ఇర్ప సునీల్, పాక సాంబయ్య ఏళ్లతో కాంగ్రెస్ పార్టీ నాయకులు తాజా మాజీ ప్రజాప్రతినిధులు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
……………………………………………………