– బిజెపి శ్రేణులు స్థానిక ఎమ్మార్వో కు వినతి పత్రం అందజేత
ఆకేరు న్యూస్, కమలాపూర్: తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలనీ బీజేపీ శ్రేణులు స్థానిక తహసీల్దార్ కి శనివారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ మాట్లాడుతూ వర్షాల వలన రైతులు కోసిన పంట ధాన్యం, పత్తి పూర్తిగా దెబ్బతిందని తడిసిన ధాన్యం తాలు, తేమా నిబంధన లేకుండా కొనుగోలు చేయాలని అన్నారు.వరి, పత్తి, మొక్కజొన్న నష్టపోయిన పంటలపై అధికారులు పై సర్వే చేెసి ఎకరానికి 25 వేల తక్షణ సహాయాన్ని అందించాలని అన్నారు. ఐకెపిల్లో తడిసిన వరీ, ధాన్యాలు ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని అన్నారు.ధాన్యం తేమ శాతాన్ని 17 – 25వరకు పెంచి ధాన్యం కొనుగోలు జరపాలని డిమాండ్ చేశారు. ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో ఇంతవరకు అమలు చేయడం లేదని, పథకాన్ని వెంటనే అమలు చేయాలని ఎమ్మార్వోని కోరామని అన్నారు.
…………………………………………………………………………
