
* ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరున్యూస్, వరంగల్: రైతులు పండిరచే చిట్ట చివరి ధాన్యపు గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. వేలేరు, ధర్మసాగర్ మండల కేంద్రాలలో పీ.ఏ.సీ.ఎస్ ధర్మసాగర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావుతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సన్నాలు పండిస్తున్న రైతులను ప్రోత్సహించడానికి మద్దతు ధరతో పాటు క్వింటాకు 500బోనస్ అందిస్తున్నట్లు గుర్తుకు చేశారు. రైతులకు ఉచిత కరెంట్, రుణ మాఫీ, రైతు భరోసా, 500బోనస్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. తేమ 17శాతం ఉండాలని, బస్తా 41కేజీలు మాత్రమే తూకం వేయాలని ఈ విషయంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం విక్రయించాలని, దళారుల వద్దకు వెళ్లి నష్టపోవద్దని సూచించారు.
……………………………………….