
ఆకేరున్యూస్, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబటిపల్లి గ్రామంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని హనుమాన్ విగ్రహం దగ్ధం కావడం ఊరంతా ఉలిక్కి పడేలా చేసింది. గర్భగుడిలోని విగ్రహం దగ్ధమవడం అంతు చిక్కని మిస్టరీగా మారింది.. విగ్రహం మంటల్లో కాలిపోవడం దృష్టశక్తుల పనా..? లేక ప్రమాద వశాత్తూ మంటలు చెలరేగాయా..? అనే అనుమానాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. తమకు అండ అనుకున్న హనుమయ్య విగ్రహం దగ్ధం కావడం ఊరికి అరిష్టమని ఆ గ్రామస్తులంతా ఆందోళన చెందుతున్నారు.
…………………………………………..