Telangana Andhra Rain Forecast
Published:
Updated: 18 Jul 2026 • 05:12 PM
అకేరు న్యూస్ డెస్క్ :బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడటంతో ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో జులై 23 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.తెలంగాణలోని పలు జిల్లాలతో పాటుగా ఏపీలోని కోస్తా ఆంధ్ర,యానాం, రాయలసీమ,తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు,ఉరుములు, మెరుపులు,గంటకు 50–70 కి.మీ.వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వెల్లడించింది.
సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో జులై 21 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.బీచ్‌ల వద్ద అలలు ఉద్ధృతంగా ఉండనున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
