* వాయిదా పడ్డ సభ
ఆకేరున్యూస్ డెస్క్ : ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ(ADANI) ఇష్యూపై లోక్సభలో రగడ కొనసాగుతోంది. అదానీ అవినీతిపై చర్చించాలని ఈరోజు కూడా విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రధాని మోదీ(MODI)కి, అదానీకి మధ్య ఉన్న స్నేహబంధంపై వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. శీతాకాల సమావేశాల తొలిరోజు నుంచీ అదానీ అంశంపై చర్చ జరపాలని విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పట్టుబడుతున్నారు. ఈ అంశంపై సభ వాయిదా పడుతూనే ఉంది. ఈరోజు కూడా స్పీకర్ ఓం బిర్లా(SPEAKER OM BIRLA) సభను వాయిదా వేశారు. కాగా, ఇటీవల వయనాడ్ నుంచి ఎంపీగా ఎన్నికైన ప్రియాంకాగాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. సోనియా(SONIA), రాహుల్ గాంధీ(RAHUL GANDHI)లతో కలిసి ఆమె లోక్సభలో అడుగుపెట్టారు.
…………………………………………