
* బస్ చార్జీల పెంపుపై కేటీఆర్ ఫైర్
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : సిటీ బస్ చార్జీలపై పెంపుపై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు ఎక్స్ వేదికగా ఆయన బస్ చార్జీల పెంపుపై విరుచుకుపడ్డారు. ఒకేసారి ఏకంగా రూ.10 పెంచి పేద, మధ్య తరగతి ప్రయాణికుల జేబులను ప్రభుత్వం కొల్లగొడుతోందన్నారు. ప్రతీ రోజూ తప్పనిసరిగా బస్ ప్రయాణం చేసే ఉద్యోగులపై అధిక భారం పడుతుందన్నారు.చార్జీల పెంపుతో ప్రయాణికుడిపై నెలకు రూ.500 అదనపు భారం పడుతుందన్నారు.కనీస చార్జీపై 50 శాతం ధర పెంచడం అసమర్థ విధానాలకు నిదర్శనమన్నారు.పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడుతున్న తరుణంలో.. ప్రతి ప్రయాణికుడిపై నెలకు 500 రూపాయల అదనపు భారం మోపితే బడుగుజీవులు ఎలా బతకాలో ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలని పేర్కొన్నారు.రాజధానివాసుల నడ్డివిరిచి ప్రతినిత్యం దాదాపు కోటి రూపాయల భారం మోపాలని చూస్తున్న ముఖ్యమంత్రి హైదరాబాద్ ప్రజలపై కక్ష పెంచుకుంటున్నట్టు అర్థమవుతోంది. తుస్సుమన్న ఫ్రీ బస్సు పథకంతో దివాళా తీసిన ఆర్టీసిని గట్టెక్కించాల్సిందిపోయి, సామాన్య ప్రయాణికుల నడ్డి విరచాలని చూడటం క్షమించరానిది.’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
…………………………………………………….