ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలోని ఏడు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ (Orange Allert) ప్రకటించింది. జనగాం, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట యాదాద్రి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షం కురవొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపుల, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు తీరం వెంబడి సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని దాని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా నేడు, రేపు మోస్తారు నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే మంగళవారం తెలంగాణ లోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్(Warangal), హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
