ఆకేరున్యూస్, న్యూఢిల్లీ : దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి రూపొందించిన రెండు కీలక బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే… ఈ ముసాయిదా బిల్లులు ఈనెల 16న లోక్సభ ముందుకు ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలి బిల్లును ప్రవేశపెడతారు. అనంతరం దీనిని చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్సభకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడమే జమిలి ఎన్నికల ప్రధాన ఉద్దేశం.
………………………………………