* వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు బి.వి.నిర్మలా గీతాంబ, బి.అపర్ణా దేవి
ఆకేరు న్యూస్, వరంగల్: లోక్ అదాలత్లో కక్షిదారులు హాజరై తమ కేసులను పరిష్కరించుకునేలా సిద్దం కావాలని వరంగల్, హన్మకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు బి.వి.నిర్మలా గీతాంబ, బి.అపర్ణా దేవి కోరారు. జాతీయ వ్యాప్తంగా నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ- వరంగల్ చైర్మన్స్ బి.వి.నిర్మలా గీతాంబ, బి.అపర్ణాదేవి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ జాతీయ లోక్ అదాలత్లో కక్షిదారులు హాజరై తమ కేసులను పరిష్కరించుకునేలా సిద్దం కావాలని కోరారు. జాతీయ లోక్ అదాలత్లో రాజీపడదగు కక్షిదారులు తమ తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టులలో తెలియపరిచి, రాజీ కుదుర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్, హన్మకొండ జిల్లాల న్యాయమూర్తులు జి.ప్రేమలత, మనీషా శ్రావణ్ ఉన్నమ్, వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ – కార్యదర్శి యం.సాయి కుమార్, హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ – కార్యదర్శి జె.ఉపేందర్ రావు మరియు ఇతర న్యాయమూర్తులు, హనుమకొండ జిల్లాఅడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఎ.సి.పి.మామునూరు తిరుపతి, వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తీగల జీవన్ గౌడ్, బార్ కౌన్సిల్ మెంబర్ దుస్స జనార్దన్, హనుమకొండ జిల్లా ఛీఫ్ లీగల్ ఏయిడ్ కౌన్సిల్ శ్రీకాంత్ మరియు ఇతర న్యాయవాదులు, లోక్ అదాలత్ బెంచ్ మెంబర్లు, వివిధ బ్యాంకు, ఇన్సూరెన్స్ అధికారులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.
……………………………………