* నేషాల్ లో మహా విషాదం
ఆకేరు న్యూస్ డెస్క్ : నేపాల్ (Nepal) లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టేకాఫ్ అవుతున్న సమయంలో విమానం కుప్పకూలి 18 మంది దుర్మరణం చెందారు. తీవ్రగాయాలతో పైలెట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నేపాల్ రాజధాని కాఠ్మాండూ (Kathmandu) లో బుధవారం ఉదయం శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన 9N-AME విమానం కాఠ్మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పోఖార్‌కు బయలు దేరింది. విమానం రన్‌వేపై టేకాఫ్ అవుతున్న సమయంలో స్కిడ్ అయ్యి రన్‌వే అంచున ఉన్న పెన్సింగ్‌ను ఢీ కొట్టి కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 19 మంది సాంకేతిక సిబ్బంది ఉన్నట్లు నేషనల్ మీడియా తెలిపింది. అందులో 18 మంది ప్రాణాలు కోల్పోగా.. పైలట్ మనీశ్ షక్య (Pilot Manish Shakya) ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ (Rescue team) వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పైలట్‌ను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇక ఇప్పటి వరకూ 13 మంది మృతదేహాలను వెలికితీశారు.
———————