* ఇస్తున్న మాపైన విమర్శలు చేయడం దారుణం
* ఇలాంటి వారిని ప్రజలు నమ్మొద్దు
* మంత్రి పొన్నం
ఆకేరున్యూస్, హైదరాబాద్: పదేళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు ఇవ్వని బిఆర్ఎస్ వాళ్లు ఇప్పుడు విమర్శలుచేయడం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 4 పథకాలు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో ప్రజలు ఎవరు అందోళన చెందవద్దన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల లబ్ది జరుగుతుందన్నారు. గ్రామాల్లో గ్రామ సభలు, వార్డు సభలు జరుగుతుండడంతో అక్కడికి వెళ్లి అధికారుల వద్దకు రేషన్‌కార్డులు రానివారు కానీ, ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక విషయంలో గ్రామ సభల్లోనే ఎంపిక చేయనున్నారని ఆయన తెలిపారు. ఎవరికైనా అర్హత ఉండి రానివారు ఉంటే గ్రామ సభలో దరఖాస్తులు పెట్టుకోవాలన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ నెలలోనే మరో 4 పథకాలు ప్రారంభం కానున్నాయని, ప్రజలు ఎవరు అధైర్యపడవద్దు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు వర్తిస్తాయన్నారు.
………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
