
* ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
* జవహర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
ఆకేరున్యూస్, ఖమ్మం: గత కొన్ని దశాబ్దాలుగా మధిర ప్రజలు సాగునీటి కోసం ఎన్నో కష్టాలు పడ్డారని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ( DEPUTY CM BHATTI VIKRAMARKA) అన్నారు.ఖమ్మం జిల్లా వంగవీడులో ఆయన 630.30 కోట్లతో జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశైలం రిజర్వాయర్ (SRISHAILAM RESARVOIR) నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించే లక్ష్యంతో ఏపీ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు పూర్తయితే కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు బారీగా నష్టం వాలటిల్లుతుందని అన్నారు.ముఖ్యంగా ఖమ్మం,(KHAMMAM) నల్గొండ,(NALGONDA) మహబూబ్నగర్,(MAHABOOBNAGAR) జిల్లాల్లోసాగునీటితో పాటు తాగునీటి సమస్యలు తీవ్రంగా తలెత్తుతాయని అన్నారు.శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ 1 టీఎంసీ నీటిని వాడుకుంటుంటే ఏపీ 11 టీఎంసీల నీటిని వాడుకుంటోందని అన్నారు.గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు.జవహర్ ప్రాజెక్టు గురించి చాలా ఏళ్లుగా తాను మాట్లాడుతన్నా పదేళ్లుగా బీఆర్ ఎస్ (BRS) ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఎన్నో సార్టు అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించాన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డితో జవహర్ ప్రాజెక్టు గురించి కోరానని ఆయన వెంటనే మంజూరు చేశారని భట్టి అన్నారు. ఉత్తం కుమార్ రెడ్డికి మధుర ప్రాంత ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని భట్టి అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి(KOMATI REDDY VENKAT REDDY) ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (PONGULETI SRINIVAS REDDY)వాకిటి శ్రీహరి (VAKITI SRIHARI) పాల్గొన్నారు.
………………………………….