
* వరంగల్ నాయకులందరీ హస్తం ఉంది
* మా ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు
* నాకు భయంగా ఉంది
* వీడియో విడుదల చేసిన కొండా సుస్మిత
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : మాకుటుంబంపై రెడ్లు కుట్ర పన్నారంటూ మంత్రి కొండా సురేఖ కుమార్తె ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి తో సహా జిల్లా కు చెందిన కడియం శ్రీహరి,బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అందరూ కలిసి మా కుటుంబంపై కుట్ర చేస్తున్నారని అన్నారు. గత కొద్ద రోజులుగా తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆమె అన్నారు. ప్రస్తుతం ఇంట్లో తాను ఒక్కదాన్నే ఉన్నానని మా ఇంటి చుట్టూ పోలీసులను మోహరించారని ఆమె తెలిపారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని అయినా ఎవరికీ భయపడేది లేదని ఆమె వీడియోలో తెలిపారు. అయినా కొండా కార్యకర్తులు ఎవరూ కూడా భయపడద్దని అందరూ ధైర్యంగా ఉండాలని ఆమె కోరారు.