
* మా కర్తవ్యాన్ని నెరవేర్చాం
* కేంద్రం పెండింగ్ ఉంచింది
* బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కట్టుబడి ఉంది
* మంత్రి పొన్నం ప్రభాకర్
ఆకేరు న్యూస్ కమలాపూర్ :తెలంగాణ ప్రభుత్వం బీసీ 42 శాతం రిజర్వేషన్ల పై నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉందని బీసీ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సామాజిక వేదిక ఎక్స్ లో వీడియో పోస్ట్ చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే నిర్వహించి అన్ని రాజకీయ పార్టీల మద్దతు బిల్లులు పాస్ చేసుకోనీ, శాసన సభ లో చట్టం చేసి, గవర్నర్ దగ్గర ఆమోదం నుండి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉందనీ ఆయన అన్నారు.మార్చి 30 నుండి గవర్నర్ దగ్గరకు వెళ్ళిన బిల్లులు ఇంత వరకు ఆమోదం పొందలేదని ఆయన అన్నారు.
బీజేపీ ఎంపీలు చొరవ తీసుకోవాలి
తెలంగాణ బిజెపి ఎంపీలు బలహీన వర్గాలైనటువంటి బీసీ ప్రజల ఆకాంక్షను కేంద్రానికి వివరించాలని ఆయన అన్నారు. ముఖ్యంగా బిజెపి మంత్రులైన బండి సంజయ్ కుమార్, కిషన్ రెడ్డి లు బిజెపి మంత్రులంతా కలిసి వివరించాలని పొన్నం ప్రభాకర్ వీడియోలో అన్నారు. నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం వలన తదుపరి చర్యలు తీసుకపోవడం వల్ల అమలు జాప్యం జరుగుతుందని ఆయన ఉన్నారు.రిజర్వేషన్లు అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా, బలహీన వర్గాలకు న్యాయం చేసిన రాష్ట్రంగా మీ నాయకత్వంలో ఇచ్చే ప్రయత్నం చేయండి అని అన్నారు.కేంద్రంలో బాధ్యత మీది..రాష్ట్రంలో మా బాధ్యత అని నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలి అని ఆయన అన్నారు. లేదంటే తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడే పరిస్థితి వస్తుందన్నారు.
……………………………………………………..