
* హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్
ఆకేరు న్యూస్ , కమలాపూర్ : పేదవాడి కడుపు నింపడానికే సన్న బియ్యం పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందనీ హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఓడితల ప్రణవ్ అన్నారు. మంగళవారం కమలాపూర్ మండలంలోని శంభునిపల్లి , పంగిడిపల్లి గ్రామాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత సన్న బియ్యం పథకాన్ని కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణితో కలిసి ఆయన ప్రారంభించి,లబ్దిదారులకు సన్న బియ్యాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ,రాష్ట్ర వ్యాప్తంగా 17,263 రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యాన్ని అందజేయడం జరుగుతుందని, సన్న బియ్యం పంపిణీ వల్ల 2300 కోట్ల భారం పడుతుందని అయినప్పటికీ , నిరుపేదల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలసాని రమేష్ గౌడ్, గుండపు చరణ్ పటేల్డా, మౌటం కుమారస్వామి, పోడేటి బిక్షపతి, మాట్ల రమేష్, తడుక శ్రీకాంత్, పుల్లూరి శ్రీనివాసరావు, బొల్లం రాజిరెడ్డి,చెరుపల్లి రామచంద్రం,కెత్తే రవి, మాట్ల రవి,దూడ శ్రీకాంత్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు జనగాని శివకృష్ణ, ఆకినపల్లి బిక్షపతి, నిగ్గుల లింగయ్య, అనిల్ రెడ్డి, మిల్కూరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
……………………………………………