* ఐదుగురు విద్యార్థులకు గాయాలు
ఆకేరు న్యూస్, నాగర్ కర్నూలు : నాగర్ కర్నూలు జిల్లా(NAGAR KARNOOL DISTRICT)లో జరిగిన ప్రమాదం కలకలం రేపింది. 20 మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూలు బస్సు (SCHOOL BUS) బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బిజినేపల్లి మండలానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు 20 మంది విద్యార్థులతో స్కూల్కు వెళ్తుండగా.. ట్రాక్టర్(TRACTOR) ఢీ కొట్టింది. దీంతో బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
……………………………………….