* మాదిగ జేఏసీ పీసీసీ జనరల్ సెక్రటరీ నమిండ్ల శ్రీనివాస్
ఆకేరున్యూస్, హన్మకొండ: మాదిగ ఉప కులాల ఆత్మీయ సదస్సును విజయవంతం చేయాలని మాదిగ జేఏసీ పీసీసీ జనరల్ సెక్రటరీ నమిండ్ల శ్రీనివాస్ కోరారు. మాదిగ సమాజం పార్టీలకు అతీతంగా ఏకమై ఎస్సీ కులాల వర్గీకరణ మరింత వేగవంతం చేసేందుకు మాదిగ, మాదిగ ఉప కులాల ఆత్మీయ సదస్సును సోమవారం కేఎల్ ఎన్ పంక్షన్ హాల్, చింతగట్టు వద్ద నిర్వహిస్తున్నామని, ఈ సదస్సుకు ప్రతిఒక్కరూ అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. మన దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవసరమైతే ఆర్డినెన్స్ తెచ్చి తెలంగాణలో అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అవసరమైతే ఉద్యోగ నోటిఫికేషన్లు కొంతకాలం ఆపుతామని.. ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణ అమలుచేస్తామని హామీ ఇచ్చారని.. సీఎం నిర్ణయంతో మాదిగ , మాదిగ ఉప కులాల ప్రజలంతా ఎంతో సంతోషించారన్నారు. కాగా, వర్గీకరణను ముందు నుండి వ్యతిరేకిస్తున్న ఒక వర్గం మాత్రం ఒక్కటై ముఖ్యమంత్రి మీద తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తూ మాదిగ సమాజం మీద తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారన్నారు. దేవుడు వర మిచ్చినా పూజారి అడ్డుకునే విధంగా కొద్దిమంది పావులు కదుపుతున్నారని నమిండ్ల శ్రీనివాస్ అన్నారు.
…………………………………………..