Swachh Kamalapur Initiative
* 8 వారాలుగా సాగుతున్న స్వచ్ఛ ఉద్యమం (Swachh Kamalapur Initiative)
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సర్పంచ్ పబ్బు సతీష్ చేపట్టిన “స్వచ్ఛ కమలాపూర్” కార్యక్రమం (Swachh Kamalapur Initiative) స్థానిక ప్రజల మద్దతుతో విజయవంతంగా ఎనిమిదో వారానికి చేరింది. ఊరి బాగు కోసం ప్రజల భాగస్వామ్యం ఉంటే సాధించలేనిదేదీ లేదని సర్పంచ్ పబ్బు సతీష్ మరోసారి నిరూపించారు.
కేవలం మాటలకే పరిమితం కాకుండా, స్వయంగా చేతుల్లోకి చీపుర్లు పట్టి గ్రామస్తుల్లో స్ఫూర్తి నింపారు.
స్వచ్ఛ కమలాపూర్ లక్ష్యంగా ఆయన పిలుపునిచ్చిన ఊరి కోసం ఒక్క రోజు శ్రమదానం కార్యక్రమంలో భాగంగా.. శనివారం గ్రామంలోని 6, 7, 8 వార్డుల్లో సర్పంచ్ పబ్బు సతీష్, వార్డు సభ్యులు, యువకులు కలిసి ఉమ్మడిగా శ్రమదానం చేశారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయికి వెళ్లి వార్డుల్లోని మురికి కాలువలను, రోడ్లను ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి శుభ్రం చేశారు.
* ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..
పారిశుధ్య పరిరక్షణ ఎంత ముఖ్యమో, వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆయా వార్డుల ప్రజలకు వివరించారు. త్వరలోనే గ్రామంలో పారిశుధ్య పనులన్నీ పూర్తి చేసి, తదుపరి విడతగా భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు సతీష్ అన్నారు.
ఈ శ్రమదాన కార్యక్రమంలో వార్డు సభ్యులు రాంశెట్టి రాజయ్య, మౌటం నాగరాజు, ఓస్కుల కీర్తన, పుల్ల శ్రీనివాస్, ఎండబెల్లి మల్లారెడ్డి, అవునూరి తిరుపతి, మార్క అశోక్, గంధసిరి బిక్షపతి, కొండమీది రవి, మౌటం రాజు, షేక్ ఖాసీం, జన్ను బిక్షపతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :
