AISF 91st anniversary
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలో అఖిల భారత విద్యార్ధి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్ ) 91 వ వార్షికోత్సవం బుధవారం మండల కమిటీ ఆధ్వర్యంలో పస్తం పృథ్విరాజ్ అధ్యక్షతన స్థానిక బస్టాండ్ వద్ద ఘనంగా నిర్వహీంచారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు రహ్మతుల్లాహ్ సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రహ్మతుల్లా మాట్లాడుతూ 1936 ఆగస్టు 12 న ఉత్తరప్రదేశ్, లక్నో లోని బెనారస్ యూనివర్సిటీలో ఏర్పడి భారత దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న ఏకైక విద్యార్ధి సంఘం ఏఐఎస్ఎఫ్ అని అన్నారు. నాటి నుండి నేటి వరకు అనేక పోరాటాలు నిర్వహిస్తూ 90 వసంతాలు పూర్తి చేసుకుంది అని అన్నారు. స్వతంత్రం అనంతరం ఈ దేశంలో శాస్త్రియ విద్యావిధానం కోసం నిరంతరం పోరాడుతున్న సంఘం ఏఐఎస్ఎఫ్ అని అన్నారు. అదేకాకుండా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ముందుండి అన్ని విద్యార్ధి సంఘాలను ఏకం చేసి జె ఏసిలు ఏర్పాటు చేసి ఆ జెఏసీలకు నాయకత్వం వహించి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం బలోపేతం చేయడం లో ఏఐఎస్ఎఫ్ కీలకపాత్ర పోషించింది అని అన్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ యునుస్ మాట్లాడుతూ విద్యార్ధి ఉద్యమ సేనాని ఏఐఎస్ఎఫ్ 90 వసంతాలు పూర్తి చేసుకొని నిరంతరం విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకం గా పోరాటాన్ని కొనసాగిస్తుందని అన్నారు విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ లో భాగస్వామ్యూలై భవిష్యత్ ఉద్యమాలకు నాంది పలకాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో ఏఐఎస్ఎఫ్ నాయకులు రంజిత్, రోహిత్, తిరుపతి, నిఖిల్, అర్జున్, సంతోష్, అఫ్రోజ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
