
* కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తాం
* ప్రధానమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్
ఆకేరు న్యూస్, డెస్క్ : ఉగ్రవాదులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (NARENDRA MODI) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కలలో కూడా ఊహించని విధంగా ఉగ్రవాదులను శిక్షిస్తామని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపే సమయం ఆసన్నమైందన్నారు. ఇది పర్యాటకులపై జరిగిన దాడి కాదని, భారత్‌పై జరిగిన దాడి అని అన్నారు. ఉగ్రవాదులను, వారికి మద్దతు ఇచ్చేవారిని గుర్తించి శిక్షిస్తామని తెలిపారు. వారు ఎక్కడున్నా, భూమి చివరి వరకు వెంబడిస్తామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్(BIHAR)లోని మధుబనిలో జరిగిన పర్యటనలో పహల్గామ్ (PAHALGAM)ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దాడిలో 26 మంది, అందులో ఒక నేపాలీ పౌరుడు సహా, ప్రాణాలు కోల్పోయారు. మోదీ తన ప్రసంగంలో, “ఈ నీచమైన చర్య వెనుక ఉన్నవారిని విడిచిపెట్టము. వారి దుష్ట ఉద్దేశాలు ఎన్నటికీ సఫలం కావు. ఉగ్రవాదంపై పోరాడే మా సంకల్పం అచంచలమైనది, ఇది మరింత బలపడుతుంది” అని తెలిపారు.
…………………………………………………