* కర్రెగుట్ట ఆపరేషన్‌పై ఐజీ కీలక వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, వరంగల్ : ఓ వైపు ఛత్తీస్‌గఢ్-తెలంగాఠణ సరిహద్దుల్లో పోలీసులు, మావోల మధ్య భారీ సంఖ్యలో కాల్పులు జరుగుతుండగా, మరోవైపు వరంగల్ లో పోలీసులకు భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. వరంగల్ (Warangal) పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో గురువారం మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి (IG Chandrasekar Reddy)సమక్షంలో 14 మంది మావోయిస్టులు (Maoists surrender) లొంగుపోయారు. వీరిలో ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు కాగా 12మంది మిలీషియన్ సభ్యులు. వీరిలో 13 మంది ఛత్తీస్‌గఢ్, ఒకరు తెలంగాణకు చెందినవారు ఉన్నారు. లొంగిపోయిన వారికి రూ.25వేల చొప్పున రివార్డు అందజేశారు. ఈ సందర్భంగా కర్రెగుట్ట ఆపరేషన్‌పై ఐజీ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్రెగుట్టపై ఆపరేషన్ తో తెలంగాణ పోలీసులకు సంబంధం లేదన్నారు. ఛత్తీస్‌గఢ్ పోలీసు బలగాలతో ఆ ఆపరేషన్ జరుగుతోందని వెల్లడించారు. తెలంగాణ పోలీసులకు ఎలాంటీ సమాచారమూ లేదని వివరించారు. కేంద్ర బలగాలు కూడా సమాచారం ఇవ్వలేదని తెలిపారు.
………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
