* వీడిన ప్రభుత్వ ఉద్యోగి హత్య కేసు మిస్టరీ
* భార్య, ప్రియుడిని అరెస్టు చేసిన పోలీసులు
* వివరాలు వెల్లడిరచిన జిల్లా ఎస్పీ
ఆకేరున్యూస్, వరంగల్: మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బోరింగ్ తండా సమీపంలో జరిగిన ఉద్యోగి హత్య మిస్టరీ వీడిరది. భర్తను ప్రియుడితో కలిసి భార్యే హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. గురువారం సాయంత్రం జిల్లా ఎస్పీ నిందితుల అరెస్టు చూపి, మీడియాకు వివరాలు వెల్లడిరచారు. పార్థసారథి, తాటి స్వప్న భార్యాభర్తలు భద్రాచలంలో నివాసం ఉంటున్నారు. పార్థసారధి మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలోని గురుకుల పాఠశాలలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, స్వప్నకు ప్రభుత్వ టీచర్ వెంకట విద్యాసాగర్ అనే వ్యక్తికి వివాహేతర సంబంధం ఉంది. పెద్ద మనుషుల సమక్షంలోనూ పలుమార్లు పంచాయితీలు నిర్వహించారు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న భర్త పార్థసారధి అస్తమానం భార్య స్వప్నను అనుమానిస్తూ వీడియో కాల్స్ లో ఇబ్బంది పెడుతుండగా తనని అడ్డుతప్పించాలని నిర్ణయించుకుంది. స్వప్న వెంకటవిద్యాసాగర్, వినయ్ కుమార్, శివశంకర్, వంశీ సహాయంతో పార్ధసారథిని హత్య చేయుటకు ఐదు లక్షల రూపాయలు సుపారిగా ఇచ్చుటకు ఒప్పుకున్నారు. సాగర్ ఉగాది సెలవులకు మార్చి 28వ తేదీన కొత్తగూడెం వచ్చి అక్కడ నుండి మరల మార్చి 31వ తేదీన తిరిగి డ్యూటీ జాయిన్ అవ్వడం కోసం దంతాలపల్లి బయలుదేరాడు. ఈ విషయమును పార్థసారథి భార్య స్వప్న, సాగర్ కు ఫోన్ ద్వారా తెలియపరచగా అదే విషయాన్ని సాగర్ ఒక కారు, కొంత సొమ్మును ఇచ్చి హత్య చేయుటకు పంపాడు. వారు వచ్చి మహబూబాబాద్ దాటిన తర్వాత బోరింగ్ తండా సమీపంలో పార్థసారధిని హత్య చేశారు. పార్ధసారధి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తాటి స్వప్న, వెంకట విద్యాసాగర్ ను అదుపులోకి విచారించగా నేరం ఒప్పుకున్నారని, వారిని అరెస్ట్ చేశామని ఎస్పీ తెలిపారు. మిగిలిన వారి కోసం పోలీస్ బృందాలు వెతుకుతున్నాయి. నిందితులు తాటి స్వప్న గృహిణి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం జగదీష్ కాలనీ, సొర్లాం వెంకట విద్యాసాగర్ (నెల్లిపాక గ్రామం, ఏటపాక మండలం, అల్లురిసీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్) అరెస్టు చేశారు. కాగా, మిగతా నిందితులు వినయ్ కుమార్, శివ శంకర్, వంశీ, కుసం లవరాజ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభచూపిన మహబూబాబాద్ డీఎస్సీ తిరుపతి రావు, మహబూబాబాద్ రూరల్ సిఐ సర్వాయ్య, బయ్యారం సిఐ రవికుమార్, గూడూర్ సిఐ సూర్యప్రకాష్, ఎస్బీ సిఐ చంద్రమౌళి, సీసీఎస్ సీఐ హాతీరాం, మహబూబాబాద్ రూరల్ ఎస్సై దీపిక, గూడూర్ ఎస్సై గిరిధర్ రెడ్డి, కేసముద్రం, బయ్యారం, కురవి ఎస్సైలను, ఐటీ కోర్ స్టాఫ్‌ను ఎస్పీ అభినందించారు.
…………………………….
