* డిప్యూటీ సీఎం ఇంట్లో చోరీ..
* 2.2 లక్షల, వెండీ, బంగారం అపహరణ
* నిందితుల అరెస్ట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగింది. చోరీ కేసులో ఇద్దరిని పశ్చిమ్‌బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఖరగ్‌పూర్ జీఆర్పీ ఎస్పీ దేబశ్రీ సన్యాల్ వెల్లడిరచారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 14లో ఉన్న భట్టి విక్రమార్క నివాసంలో.. దొంగలు పడ్డారు. ఇంటి తాళం పగులగొట్టి.. లోపల ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు కూడా ఎత్తుకెళ్లారు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. రంగంలోకి దిగిన పోలీసులు.. భట్టి నివాసానికి చేరుకుని అక్కడ ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజీల్లో చోరీకి సంబంధించిన వీడియోలు పరిశీలించగా.. దుండగులు బిహార్‌కు చెందిన వారీగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విదేశాల్లో ఉన్న భట్టి విక్రమార్కకు ఈ దొంగతనం విషయం తెలియడంతో.. ఆయన పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టగా పశ్చిమ బెంగాల్లో పోలీసులకు దొరికిపోయారు. ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్లో ఏడో నంబర్ ప్లాట్‌ఫాంపై జీఆర్పీ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని వెంటనే అదుపులోకి తీసుకొని విచారించగా దొంగలమని ఒప్పుకున్నారు. నిందితులు బిహార్‌కు చెందిన రోషన్‌కుమార్ మండల్, ఉదయ్‌కుమార్ ఠాకూర్‌గా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో దొంగతనం చేసి పారిపోతున్నట్టు తెలిపినట్టు ఖరగ్‌పూర్ జీఆర్పీ ఎస్పీ దేబశ్రీ సన్యాల్ వెల్లడిరచారు. నిందితుల వద్ద 2.2 లక్షల రూపాయల నగదుతో పాటు 100 గ్రాముల బంగారు నాణెం, కొంత విదేశీ కరెన్సీ నోట్లు, పెద్ద మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు కూడా స్వాధీనం చేసుకున్నామని బెంగాల్ పోలీసులు తెలిపారు. ఈ విషయంపై తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడిరచారు. విచారణ అనంతరం తెలంగాణలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించగా ఆ పోలీస్‌స్టేషన్‌లో ఈ చోరీ ఘటనకు సంబంధించి నిందితుడు రోషన్ కుమార్ మండల్ పేరుతో కేసు నమోదైనట్లు గుర్తించారు. నిందితులను ఖరగ్‌పూర్ కోర్టులో హాజరుపరచనున్నారు.
…………………………………..